ఉసిరి మొండిజాతి చెట్టు. నీటి ఎద్దడిని చాలవరకు తట్టుకొంటుంది. కాని నీటి యాజమానన్ని పాటిస్తే మొక్కలలో పెరుగుదల బాగుండి ఎక్కువ దిగిబడులు పొందవచ్చు. మొదటి మూడు సంవత్సరాల వరకు అవసరాన్ని బట్టి సరైన మోతాదులో నీరిస్త్ మొక్కలు బాగా పెరుగుతాయి. ఒక్కో మొక్కకు రోజుకు 5౦ లిటరు వరకునీరు అవసరం అవుతుంది.
అంటు మొక్కలు నాటిన తరువాత ఒక నెల వరకు రోజు విడిచి రోజు నీరివ్వాలి. ఆ తరువాత మూడు నాలుగు నెలల వరకు మూడు, నాలుగు రోజులకొకసారి నీటిని పారించాలి.
ఎండాకాలంలో మాత్రం 4-5 రోజుల కొకసారి నీరివ్వాలి. అయితే కాపుకు వచ్చిన చెట్లకు నవంబర్- డిసెంబర్ మాసాల్లో బెట్ట పరిస్థేతులు కలిపించడం మంచిది. లేకపోయిన ఎడల పూత సరిగా రాదు.
డ్రిప్ పద్దతి ద్వారా నీరిస్తే ౩౦-4౦ శాతం నీటిని అదా చేయవచ్చు. డ్రిప్ పద్దతిలోచెట్లుత్వరగా పెరిగి అధిక దిగిబడులు ఇవ్వగలవు.
వర్శదారంగా సాగు చేసేతప్పుడు చెట్ల నాటిన తరువాత ప్రతిచెట్టుకు ఒక కుండను అమర్చి కుండ క్రింది భాగాన సన్నని రంధ్రం చేసి రంధ్రంలో గుడ్డ ఒత్తిని అమర్చి, కుండ నిండా నీరు పోసి నీరు ఆవిరి అయిపోకుండా పైన మూత పెట్టాలి. ఇట్లా చేయడం వలన తక్కువ నీటితో, తక్కువఖర్చుతోఎక్కువ చెట్టను బతికించుకోవచ్చు.
వర్షాధారపు పండ్ల తోటలకు పాదుల్లో వేరుశనగ పొట్టు లేదా వరి పొట్టు లేదా ఏవిధమైనా ఆకు పొట్టులతోనయినా 5 సెం.మీ. మందం మల్చింగ్ చేసుకోవాలి. వరుసల మధ్య 5 శాతం వాలును కల్పించి చెట్లకు వర్షపు నీటిని మళ్చాలి.